మద్యం తాగి వాహనం నడిపితే భారీ జరిమానాలు తప్పవు

రిపోర్టర్: రాము స్థలం: శ్రీ సత్యసాయి

శ్రీ సత్యసాయి జిల్లాలో ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను మరింత కఠినతరం చేశారు. రహదారి భద్రతకు ముప్పుగా మారుతున్న మద్యం ప్రియులపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో తనకల్లు మండలంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ భారీగా జరిమానాలు విధిస్తున్నారు.