వృద్ధురాలపై అత్యాచార కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష

రిపోర్టర్: అశోక్ స్థలం: నెల్లూరు

నెల్లూరులో ఒంటరిగా ఉన్న వృద్ధురాలపై అత్యాచారానికి పాల్పడిన వల్లూరు పెంచలయ్యకు నెల్లూరు కోర్టు పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించింది. 2017లో జరిగిన ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి ఏఎన్‌ శైలజ మంగళవారం ఈ సంచలన తీర్పు వెల్లడించారు. ప్రాసిక్యూషన్ వాదనలు, సాక్ష్యాధారాల ఆధారంగా నేరం రుజువు కావడంతో కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది.