కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే తెలంగాణలో కరువు పరిస్థితులు: జగదీశ్ రెడ్డి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తెలంగాణలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన మాక్ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ హయాంలోనే రెండు కోట్ల ఎకరాలు సాగులోకి వచ్చాయని, కాళేశ్వరంతో సస్యశ్యామలమైన తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో నీరు సముద్రపాలవుతోందని మండిపడ్డారు.