తిరుమలలో బ్రహ్మోత్సవాల భద్రతపై ఆక్టోపస్ మాక్ డ్రిల్.

రిపోర్టర్: అశోక్ స్థలం: తిరుపతి

శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో ఆక్టోపస్ విభాగం పటిష్టమైన మాక్ డ్రిల్ నిర్వహించింది. టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమక్షంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా భద్రతా బలగాలు విన్సయాలు చేపట్టాయి. సెప్టెంబర్ 15 నుంచి జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు భద్రతా ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.