వైఎస్సార్ హయాంలోనే మహిళలకు ఆర్థిక భరోసా దక్కిందన్న వైఎస్సార్సీపీ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Andhra Pradesh

మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో పావలా వడ్డీకి రుణాలు అందించే కార్యక్రమాన్ని దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అమలు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఆయన పాలనలో స్వయం సహాయక సంఘాల మహిళలకు పూర్తిస్థాయిలో ఆర్థిక తోడ్పాటు లభించిందని పేర్కొంది. ఆ రుణాలు మహిళలకు మెరుగైన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఎంతగానో దోహదపడ్డాయని, దీని ద్వారా అనేక కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడి ప్రగతి సాధించాయని వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది.