వైద్య విద్యనభ్యసించే నిరుపేద దళిత విద్యార్థినికి ఆర్థిక చేయూత

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

వర్ధన్నపేట పట్టణానికి చెందిన దళిత పేద విద్యార్థిని కొండేటి అకిరా ఎంబీబీఎస్ సీటు ఫీజు చెల్లింపు కోసం స్థానిక ఎమ్మెల్యే K.R. నాగరాజు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు ఈగ దామోదర్ రూ.20,000 తక్షణ ఆర్థిక సాయం అందించారు. కడు పేదరికంలోనూ పట్టుదలతో సీటు సాధించిన అకిరాను ఆమె తల్లిదండ్రులతో కలిసి శాలువాతో సత్కరించారు. భవిష్యత్తులోనూ అన్ని విధాల సహకరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.