గజపతినగరంలో భారీ బైక్ ర్యాలీతో కదంతొక్కిన టీడీపీ శ్రేణులు
రిపోర్టర్: andluri ganesh
స్థలం: గజపతినగరం
గజపతినగరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మంగళవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ పలు నినాదాలు చేస్తూ ఈ ర్యాలీ జరిపారు. పురిటి పెంట ఎంపీటీసీ రెండు అభ్యర్థి అట్టాడ లక్ష్మనాయుడు తో పాటు వి వి ప్రదీప్ కుమార్ జయ రాజు తదితర ప్రముఖ నాయకులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.