డైవర్షన్ డ్రామాలతో 22ఏ అక్రమాల నుంచి రేవంత్ తప్పించుకోలేడు
రిపోర్టర్: అశోక్
స్థలం: తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని డైవర్షన్ డ్రామాలు ఆడినా 22ఏ అక్రమాల నుంచి తప్పించుకోలేరని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. నిండు శాసనసభలో అబద్ధాలు చెప్పి దొరికిపోయిన దొంగ రేవంత్ అని మండిపడ్డారు. దమ్ముంటే తమను శాసనసభకు అనుమతించి చర్చ పెట్టాలని సవాల్ విసిరారు. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎర్రవల్లి భూముల సర్వలో రేవంత్ బండారం బయటపడుతుందని హెచ్చరించారు.