కాంగ్రెస్ ప్రభుత్వానికి విఘ్నేశ్వరుడు సద్బుద్ధి ప్రసాదించాలి: రాంచందర్ రావు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేలా గణేశ్ మండపాల నిర్వాహకులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కోరారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా రేవంత్ రెడ్డి సర్కార్‌కు ఆ విఘ్నేశ్వరుడు సరైన సద్బుద్ధిని ప్రసాదించాలని వేడుకున్నారు. పండుగ వేళ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.