కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మండిపాటు
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు అవినీతిలో పోటీ పడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మండిపడ్డారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో టీవీ నటి వేములపల్లి స్వర్ణలతతో పాటు పలువురు కళాకారులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాలు రైతులను, ఉపాధ్యాయులను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై బీజేపీ గట్టి పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.