భారీ వర్షాల హెచ్చరిక: ఐటీ ఉద్యోగులకు మధ్యాహ్నం రెండు గంటలకే లాగౌట్

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఐటీ కంపెనీలు మధ్యాహ్నం రెండు గంటల నుంచే ఉద్యోగులకు లాగౌట్ అవకాశం కల్పించాలని, వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని సూచించినట్లు అధికారులు తెలిపారు. రహదారులపై నీరు నిలిచిపోకుండా, ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ఈ ముందస్తు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.