ముంబైలో ప్రముఖ నటుడు ముస్తాక్ ఖాన్ అంత్యక్రియలు పూర్తి

రిపోర్టర్: సతీష్ స్థలం: ముంబై

దివంగత ప్రముఖ నటుడు ముస్తాక్ ఖాన్ అంత్యక్రియలు ముంబైలోని యారీ రోడ్ శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల మధ్య ప్రశాంత వాతావరణంలో ముగిశాయని ఆయన కుమారుడు మొహ్సిన్ ఖాన్ తెలిపారు. క్యాన్సర్ బారిన పడిన ఆయన గత నెల 24న నాావతి ఆసుపత్రిలో కన్నుమూశారని, అనారోగ్యంతో ఇబ్బంది పడినప్పటికీ చివరి క్షణంలో ఆయన పెదవులపై చిరునవ్వు చెదరలేదని మొహ్సిన్ ఆవేదనగా వెల్లడించారు. ఈ అంతిమయాత్రలో రజత్ బేడీ, అలీ ఖాన్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.