అర్సాపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశం

రిపోర్టర్: రాజేష్ స్థలం: నిజామాబాద్

నిజామాబాద్ లో జరిగిన దిశా సమావేశం అనంతరం కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అర్సాపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి Arvind Dharmapuri పరిశీలించారు. ఈ సందర్భంగా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న భూసేకరణ సమస్య ఎట్టకేలకు పరిష్కారమైందని ఆయన తెలిపారు. పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో పాటు అధికారులను ఆదేశించినట్లు Arvind Dharmapuri వెల్లడించారు.