ఢిల్లీలో కలకలం: పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన తెలిపిన ఏసీపీ సస్పెండ్

రిపోర్టర్: నరేష్ స్థలం: న్యూఢిల్లీ

పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన ఏసీపీ మానస్వి వశిష్టను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. న్యాయవాదులతో ఘర్షణ నేపథ్యంలో బదిలీ అయిన ఇద్దరు అధికారుల చర్యను వ్యతిరేకిస్తూ వందలాది మంది పోలీసులు ఆందోళనకు దిగారు. వశిష్ట బదిలీని నిరసిస్తూ నిర్వహించిన ఈ ఆందోళన తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో శాఖాపరమైన విచారణ చేపట్టి ఈ సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేశారు.