పోలేరమ్మ జాతర మహోత్సవానికి మంత్రి ఆనంకు ఆహ్వానం
రిపోర్టర్: Venkey ...Nlr
స్థలం: కలువాయ
శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి హాజరుకావాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని నిర్వాహకులు ఆహ్వానించారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో పాటు దేవస్థాన పాలక మండలి సభ్యులు, అధికారులు కలిసి నెల్లూరులోని ఆయన నివాసంలో ఆహ్వాన పత్రిక అందజేశారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు ఈ జాతర వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి.