నారాయణపేటలో అభివృద్ధి నిధుల కేటాయింపుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిలదీత

రిపోర్టర్: శివ స్థలం: నారాయణపేట

నారాయణపేట పట్టణంలో తొమ్మిది నెలలు గడుస్తున్నా ఏ ఒక్క వార్డులోనూ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించకపోవడం విచారకరమని నారాయణపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రే వెంకటేష్ గౌడ్ మండిపడ్డారు. ప్రతి కౌన్సిల్ సమావేశంలోనూ బిల్లుల ఆమోదానికే ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ప్రతి వార్డుకు పది లక్షల చొప్పున నిధులు కేటాయించాలని మున్సిపల్ చైర్మన్ను డిమాండ్ చేశారు.