ఢిల్లీలో కారును ఆటో తాకిందని ఆగ్రహంతో ఊగిపోయిన మహిళ

రిపోర్టర్: సతీష్ స్థలం: న్యూఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీలోని హైదర్‌పూర్ బాద్లీ మోర్ మెట్రో స్టేషన్ వద్ద కారును ఆటో స్వల్పంగా ఢీకొందన్న కోపంతో ఒక మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆటో డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగి, తన ప్రతాపాన్ని ఆటోపై చూపింది. ఆటో హెడ్‌లైట్, వైపర్‌ను ధ్వంసం చేసింది. తాను సిబ్బందినని, తనపై ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేరంటూ బెదిరింపులకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుూ ఆమెపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను డిమాండ్ చేశారు.