అంతరిక్ష ప్రయోగాల్ లో సంచలనం: నాసాతో చేతులు కలిపిన దిగ్గజ సంస్థ గూగుల్
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
భవిష్యత్ అంతరిక్ష యాత్రల్ లో వ్యోమగాముల ప్రాణాలను కాపాడేందుకు నాసాతో కలిసి అత్యాధునిక రోబోటిక్ వైద్య సహాయకుడిని అభివృద్ధి చేస్తున్నట్లు గూగుల్ పబ్లిక్ సెక్టార్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ జిమ్ కెల్లీ స్పష్టం చేశారు. మార్స్ యాత్రల సమయంలో భూమితో సమాచార సంబంధాలు నిలిచిపోయే ప్రమాదం ఉన్నందున, ఈ కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థ వ్యోమగాములకు స్వయంప్రతిపత్తితో వైద్య సేవలను అందించడంతో పాటు సాధారణ నిర్వహణ పనులను కూడా సులభంగా నిర్వహించగలదని అధికారులు తెలిపారు.