వైద్య రంగంలో ఏపీ ప్రగతి దేశానికే ఆదర్శం: జేపీ నడ్డా
రిపోర్టర్: కిరణ్
స్థలం: ఎన్టీఆర్ జిల్లా
విజయవాడలో సీఎం చంద్రబాబుతో కలిసి కేంద్రమంత్రి జేపీ నడ్డా క్రిటికల్ కేర్ బ్లాకులు, పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లను ప్రారంభించారు. వైద్య ఆరోగ్య రంగంలో ఏపీ అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని, చంద్రబాబు దార్శనిక నాయకత్వంతో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. అమరావతి క్వాంటమ్ బయో వ్యాలీ అభివృద్ధికి పూర్తి కేంద్ర సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. మిషన్ ఇంద్రధనుస్సులో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందని ప్రశంసించారు.