ఉత్తరాఖండ్ మంత్రి రేఖ ఆర్య సంచలనం: భర్తపై హత్యాయత్నం కేసు నమోదు

రిపోర్టర్: హరి స్థలం: Dehradun

ఉత్తరాఖండ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి రేఖ ఆర్య తన భర్త గిర్ధారి లాల్ సాహుపై ఘాటైన ఫిర్యాదు చేశారు. తనను శారీరకంగా హింసించడంతో పాటు హత్యకు కుట్ర పన్నారంటూ డెహ్రాడూన్ గర్హి కాంత్ పోలీస్ స్టేషన్లో ఆమె గురువారం రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. మోసం, ఫోర్జరీ మరియు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులు పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసినట్లు అధికారులు వెల్లడించారు.