మక్కా రక్షణ ఒప్పందంపై పాకిస్థాన్ యూటర్న్ వైఖరి

రిపోర్టర్: హరి స్థలం: World

పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు కుదుర్చుకున్న మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంపై పాక్ విదేశాంగ శాఖ స్పష్టతనిచ్చింది. ఈ ఒప్పందాన్ని ప్రాంతీయ భద్రతను నిర్ధారించే రక్షణ కూటమిగా అభివర్ణించింది. హౌతీ తిరుగుబాటుదారుల దాడుల నేపథ్యంలో ఈ త్రైపాక్షిక ఒప్పందం అమలులోకి వస్తుందని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరించగా, ప్రస్తుతానికి దీని విస్తరణపై చర్చలు లేవని పాక్ పేర్కొనడం గమనార్హం.