తెలంగాణలో రేపటి నుంచి మళ్లీ మొదలుకానున్న వర్షాలు: వాతావరణ శాఖ వెల్లడి

రిపోర్టర్: గోపి స్థలం: Telangana

తెలంగాణలో రేపటి నుంచి వర్షాలు మళ్లీ ప్రారంభం కానున్నట్లు Telangana Weatherman వెల్లడించారు. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాలలో రేపు రాత్రి వేళల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడే సూచనలు ఉన్నాయని, ముఖ్యంగా నవంబర్ 2 నుంచి 5 మధ్యలో మంచి వర్షాలు కురుస్తాయని ఆయన స్పష్టం చేస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు.