కర్నూలులో 629 మంది ట్రైనీ పోలీసుల పాసింగ్ ఔట్ పరేడ్
రిపోర్టర్: హరి
స్థలం: కర్నూలు
కర్నూలు నగరంలోని ఏపీఎస్పీ రెండవ బెటాలియన్‌లో సెప్టెంబర్ 26వ తేదీన 629 మంది ట్రైనీ పోలీసుల పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుక ఏర్పాట్లపై కమాండెంట్ దీపికా పాటిల్ పోలీసు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పరేడ్ ఏర్పాట్లపై అధికారులకు పలు కీలక సూచనలు చేస్తూ తగు దిశానిర్దేశం చేశారు.