తెలుగు రాష్ట్రాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
రిపోర్టర్: నరేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది. విశాఖపట్నం-గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం సహా పలు జిల్లాల్లో ఆకస్మిక వరద ముప్పు ఉందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.