తెలంగాణలో ఎల్నీనో ప్రభావం: జులై వరకు వర్షాలు పడే అవకాశం లేదని మంత్రుల స్పష్టీకరణ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
రాష్ట్రంలో ఎల్నీనో ప్రభావంతో వచ్చే జులై నెల వరకు వర్షాలు పడే పరిస్థితి లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లు తెలిపారు. సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో వారు మాట్లాడారు. ఈ తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలందరూ నీరు, విద్యుత్ వనరులను అత్యంత పొదుపుగా వాడుకోవాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. తాగునీటికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని, యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు.