పంజాబ్‌లో మాదకద్రవ్యాలపై గళమెత్తితే వేధింపులా అంటూ సచిన్ పైలట్ ఆగ్రహం
రిపోర్టర్: కిరణ్
స్థలం: Punjab
పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలో డ్రగ్స్ మాఫియాపై ప్రశ్నించినందుకు నామోల్ గ్రామానికి చెందిన జగ్గా సింగ్ అనే వ్యక్తి కలెక్టర్ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడం పట్ల కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఆప్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా గళం ఎత్తుతున్నవారికి రక్షణ కరవైందని, ప్రభుత్వం ఇస్తున్న హామీలకు క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన లేదని ఆయన మండిపడ్డారు.