అర్నబ్ తుపాను బీభత్సంతో ఏపీలోని పలు జిల్లాలను ముంచెత్తనున్న భారీ వర్షాలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాలకొండ
అర్నబ్ తుపాను ప్రభావంతో బుధవారం ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించి ప్రజలను అప్రమత్తం చేశారు.