మేరీల్యాండ్‌లో ఘనంగా బతుకమ్మ, దసరా వేడుకలు
రిపోర్టర్: సునీల్
స్థలం: United States
మేరీల్యాండ్ తెలంగాణ కమ్యూనిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 17, 2026 న బతుకమ్మ మరియు దసరా సంబరాలు ఘనంగా నిర్వహించనున్నారు. మారియట్స్ రిడ్జ్ హైస్కూల్‌లో సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ సాంస్కృతిక వేడుకలు జరగనున్నాయి. కుటుంబసమేతంగా ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.