బ్యాడ్మింటన్ లో మరో ఘనత: హైలో ఓపెన్ ఛాంపియన్ గా పీవీ సింధు

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

జర్మనీ వేదికగా జరిగిన హైలో ఓపెన్ సూపర్ టోర్నమెంట్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఛాంపియన్గా అవతరించారని నిర్వాహకులు తెలిపారు. ఆదివారం ముగిసిన తుదిపోరులో డెన్మార్క్ క్రీడాకారిణి లైన్ హోజ్మార్క్ క్జార్స్ఫెల్ట్ను ఓడించి సింధు ఈ విజయం సాధించారు. కేవలం ముప్ పై తొమ్మిది నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో ఆమె అద్భుతమైన ప్రతిభ కనబరిచి తొలి గేమ్ను ఇరవై ఒకటి పన్నెండుతో, రెండో గేమ్ను ఇరవై ఒకటి పద్నాలుగుతో కైవసం చేసుకుని విజేతగా నిలిచారు.