వైసీపీ నేత మృతిని రాజకీయాలకు వాడటం సిగ్గుచేటని మంత్రి డోలా ఆగ్రహం

రిపోర్టర్: గోపి స్థలం: ప్రకాశం

వైసీపీ నేత కాకుమాను రాజశేఖర్ మృతిని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం అత్యంత సిగ్గుచేటని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హత్యలు, శవ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన గొడ్డలి పార్టీ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం వెంటనే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. రాజశేఖర్పై నిజంగానే పోలీసులు దాడి చేసి ఉంటే ఆయన్ను ఆసుపత్రికి తరలించకుండా ఎందుకు వదిలేశారని ఆయన ప్రశ్నించారు. ఈ మృతిపై తప్పుడు ప్రచారాలు మాని వాస్తవాలు గ్రహించాలని మంత్రి హితవు పలికారు.