రైలు కోచ్‌లో ప్రయాణికుడి మూత్రవిసర్జన ఘటనపై తీవ్ర దుమారం
రిపోర్టర్: సతీష్
స్థలం: న్యూఢిల్లీ
రద్దీగా ఉన్న రైలు కోచ్‌లో ఓ ప్రయాణికుడు అందరి సమక్షంలో మూత్రవిసర్జన చేసిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది. తోటి ప్రయాణికులు నిలదీయడంతో ఆయన వారిపైనే గొడవకు దిగినట్లు ఎక్స్ వేదికగా వెల్లడైంది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా, స్పందించిన రైల్వే సేవా అధికారులు పూర్తి వివరాలు అందించాలని కోరారు. ఈ ఘటనపై తగిన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.