స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు: అసెంబ్లీలో కన్నీరు పెట్టుకున్న గడ్డం ప్రసాద్ కుమార్
రిపోర్టర్: శివ
స్థలం: తెలంగాణ
తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సభలో తనను, తన కుటుంబాన్ని దూషించడంపై స్పీకర్ కన్నీరు పెట్టుకున్నారు. స్పీకర్‌కు జరిగిన అవమానం సమాజానికి జరిగిన అవమానమంటూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయాలని, కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.