సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలతో వెంటనే చర్చలు జరపాలి
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు జరిగే వరకు అన్ని కార్మిక సంఘాలతో యాజమాన్యం సమానంగా చర్చించాలని గోదావరిలో బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ కృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీరాంపూర్ లో జరిగిన రీజియన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసిన వెంటనే అన్ని కార్మిక సంఘాలకు సమాన హోదా కల్పించారని గుర్తుచేశారు.