చిన్నారిపై లైంగిక దాడి యత్నం.. పోక్సో కేసు నమోదు
రిపోర్టర్: SHIVA
స్థలం: బెల్లంపల్లి
, మంచిర్యాల జిల్లా:
బెల్లంపల్లి లో మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన ఘటన శనివారం రాత్రి కలకలం రేపింది. రూరల్ సీఐ హనోక్ తెలిపిన వివరాల ప్రకారం.. శాంతిఖని బస్తీకి చెందిన కంపల్లి కిష్టయ్య చిన్నారిని ఆడిస్తానంటూ తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించినట్లు తెలిపారు.
చిన్నారి అతడి నుంచి తప్పించుకుని కేకలు వేస్తూ ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. వారు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, చిన్నారిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ హనోక్ తెలిపారు.