నిజామాబాద్‌లో నడిరోడ్డుపై యూట్యూబర్ భర్త హరిబాబు భీకర హత్య

రిపోర్టర్: రమేష్ స్థలం: నిజామాబాద్

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్‌ఆర్‌ చౌరస్తాలో నడిరోడ్డుపై యూట్యూబ‌ర్ వైష్ణ‌వి భ‌ర్త హరిబాబును దుండగులు కిరాతకంగా హత్య చేశారు. కారులో వచ్చి కాపుకాసి, కత్తితో విచక్షణారహితంగా నరికి చంపినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వెల్లడైంది. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.