ఏపీ ఉద్యోగులకు శుభవార్త: పీఆర్సీ, డీఏల చెల్లింపులకు సీఎం గ్రీన్‌సిగ్నల్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అమరావతి

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు తీపి కబురు అందించారు. పీఆర్సీ ఏర్పాటుతో పాటు అక్టోబర్ 1 నుంచి రెండు డీఏలు, 2022 నాటి సరెండర్ లీవ్‌ల చెల్లింపునకు ప్రభుత్వం అంగీకరించింది. ఈహెచ్‌ఎస్ బకాయిలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఐఆర్ అంశంపై కొంత సమయం కోరగా, ఉద్యోగ సంఘాల నేతలు సానుకూలంగా స్పందించారు.