'యూపీఐపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు': కేంద్ర ప్రభుత్వం స్పష్టత
రిపోర్టర్: సునీల్
స్థలం: న్యూఢిల్లీ
యూపీఐ లావాదేవీలపై విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. యూపీఐ అంశంపై వస్తున్న వదంతులకు చెక్ పెడుతూ స్పష్టమైన వివరణ ఇచ్చింది. పీటుపీ యూపీఐ చెల్లింపులు పూర్తిగా ఉచితంగా కొనసాగుతాయని, రెండు వేల రూపాయల వరకు మర్చంట్ పేమెంట్స్‌పై ఎలాంటి ఎండీఆర్ చార్జీలు ఉండవని స్పష్టం చేసింది. ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించేందుకు ప్రభుత్వం ఈ కీలక ప్రకటన చేసింది.