నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ధర్మస్థల నియోజకవర్గం' సినిమా రివ్యూ
రిపోర్టర్: సునీల్
స్థలం: India
సుమన్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో తెరకెక్కిన 'ధర్మస్థల నియోజకవర్గం' నేడు విడుదలైంది. నియోజకవర్గాన్ని శాసిస్తున్న ఎమ్మెల్యే బైర్రాజు అరాచకాలను, డ్రగ్స్ మాఫియాను ఎదిరించే సామాన్యుడి పోరాటమే ఈ చిత్రం. రాజకీయాలు, సామాజిక బాధ్యత నేపథ్యంలో సాగే ఈ సినిమా, ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా ఉన్నా, సెకండ్ హాఫ్ ఆసక్తికరమైన మలుపులతో సాగుతుంది. యువతకు డ్రగ్స్, ఓటు హక్కుపై మంచి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు.