పీఏసీఎస్‌లలో వేల కోట్ల నిధుల స్వాహా: డిపాజిటర్లకు మొండిచేయి చూపుతున్న వైనం
రిపోర్టర్: సురేష్
స్థలం: Amaravati
సహకార పరపతి సంఘాల్లో అధికారులు, నేతలు కలిసి బినామీ పేర్లతో భారీగా రుణాలు స్వాహా చేశారని దేవరపల్లి సోమేశ్వరావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగినా రికవరీ శూన్యమని ఆయన వెల్లడించారు. గడువు తీరినా డిపాజిట్లు వెనక్కి ఇవ్వకపోవడంతో వైద్య ఖర్చులు, పిల్లల చదువుల కోసం రైతులు బయట అప్పులు చేయాల్సి వస్తోందని బాధితులు వాపోయారు. అక్రమార్కులపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.