నేరాలపై ఉక్కుపాదం మోపుతామంటూ గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు కీలక ఆదేశాలు
రిపోర్టర్: రమేష్
స్థలం: జోగులాంబ గద్వాల
నేరాలపై ఉక్కుపాదం మోపుతూ ప్రజల భద్రత కోసం పటిష్టమైన పోలీసింగ్ అమలు చేయాలని ఎస్పీ జోగులాంబ గద్వాల శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. మంత్లీ క్రైమ్ రివ్యూ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి కేసులోనూ నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందించాలని స్పష్టం చేశారు. అలాగే రాబోయే దేవి నవరాత్రులకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయడంతో పాటు సైబర్ మరియు రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలని ఉన్నతాధికారులకు ఆయన కీలక సూచనలు చేశారు.