కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వీధి నాటకాలు ఆడుతున్నాయి: రాంచందర్రావు
రిపోర్టర్: సురేష్
స్థలం: తెలంగాణ
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజా సమస్యలను పక్కనబెట్టి రాజకీయ వీధి నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ నేత రాంచందర్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పబ్లిసిటీ కోసం ఇరు పార్టీలు సవాల్లతో స్టంట్లు చేస్తున్నాయని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించకుండా సభ సమయం వృథా చేస్తున్నాయని విమర్శించారు. రాజకీయ స్వార్థం వీడి ప్రజల సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు.