'లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు': కీసర ఎస్ఐ అరెస్ట్
రిపోర్టర్: శివ
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరలో పీడీఎస్ బియ్యం కేసులో బాధితుడి నుంచి రూ.5 లక్షల లంచం తీసుకుంటూ ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ కేసులో కీసర సీఐ ఆర్కపల్లి ఆంజనేయులు పాత్రపై కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ మజీద్ ఖాన్ అలీ తెలిపిన వివరాల ప్రకారం, నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తూ పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు.