బీఎస్ఎన్ఎల్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు దేశవ్యాప్తంగా అధికారులతో సమీక్ష
రిపోర్టర్: శివ
స్థలం: గుంటూరు
బీఎస్ఎన్ఎల్ సర్వీసులను మరింత బలోపేతం చేసే దిశగా నాలుగు రోజుల పాటు వివిధ సర్కిళ్ల వారీగా సమగ్ర సమీక్ష నిర్వహించినట్లు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ - కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ వెల్లడించారు. దేశవ్యాప్తంగా టవర్ల అందుబాటును ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మెరుగైన నెట్వర్క్ ఉంటేనే ప్రజలకు సేవలు సక్రమంగా అందుతాయని, ఈ దిశగా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.