రాష్ట్రంలో కలకలం: కాంగ్రెస్ పార్టీ తీరుపై సీనియర్ మంత్రి తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీ కబ్జా కాంగ్రెస్ గా మారిపోయిందని ఓ సీనియర్ మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, పార్టీని నమ్ముకున్న మూలవాసులను కాదని కొత్త వారికి పీఠం వేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంలో బ్రోకర్ల రాజ్యం నడుస్తోందని, పదవుల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందారు. ఈ సంప్రదాయంపై త్వరలోనే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ఆ మంత్రి స్పష్టం చేశారు.