ఈ నెల 25న ప్రేమనే ఊరిలో సినిమా విడుదల
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ ప్రధాన పాత్రల్లో మనోజ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమనే ఊరిలో చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో చిత్రబృందం పాల్గొని సినిమాపై తమ అంచనాలను పంచుకున్నారు. గతంలో తాను విడుదల చేసిన సక్సెస్‌ఫుల్ చిత్రాల స్థాయిలో ఈ సినిమా కూడా భారీ లాభాలను తెచ్చిపెడుతుందని నిర్మాత సురేశ్ కొండేటి ధీమా వ్యక్తం చేశారు.