ప్రధాని మోదీ నోట హోమియోపతి ప్రస్తావన స్వాగతించదగినది: డా. శివ ప్రసాద్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో హోమియోపతిని ప్రస్తావించడంపై తెలంగాణ హోమియోపతిక్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డా. చినుకని శివ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఈ వైద్య విధానంపై ప్రజల్లో మరింత అవగాహన పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
హోమియోపతిని దేశ ఆరోగ్య వ్యవస్థలో ఆయుష్ విభాగంగా దీని ప్రాధాన్యతను గుర్తించాలని ఆయన కోరారు. ప్రభుత్వ వైద్య వ్యవస్థలో హోమియోపతి సేవలను బలోపేతం చేసి, వైద్యులకు తగిన అవకాశాలు కల్పించాలని డా. శివ ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.