ఓల్డ్ మాంక్ రమ్ కాదు, బాంబే హైకోర్టులో ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రకటన
రిపోర్టర్: సురేష్
స్థలం: India
ప్రసిద్ధ లిక్కర్ బ్రాండ్ ఓల్డ్ మాంక్ అసలు రమ్ కాదని ఎఫ్ఎస్ఎస్ఏఐ బాంబే హైకోర్టుకు స్పష్టం చేసింది. ఇందులో కృత్రిమ రమ్ ఫ్లేవర్, న్యూట్రల్ స్పిరిట్ వాడుతున్నందున దీనిని 'రమ్-ఫ్లేవర్డ్ స్పిరిట్'గా మాత్రమే లేబుల్ చేయాలని పేర్కొంది. అలాగే '7 ఏళ్ల బ్లెండెడ్' అనే వాదనను కూడా తప్పుబట్టింది. ఈ పరిణామంతో సోషల్ మీడియాలో ఓల్డ్ మాంక్ ప్రియులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తూ మీమ్స్ షేర్ చేస్తున్నారు.