ఓటరు జాబితాలో తప్పులు: బొబ్బిలిలో మృతి చెందనట్లు మార్ కు వేయడంతో గందరగోళం
రిపోర్టర్: రాజేష్
స్థలం: బొబ్బిలి
బొబ్బిలి పట్టణంలోని పదకొండో వార్డులో ఓటరు జాబితాలో తప్పుల కారణంగా కొద్దిసేపు గందరగోళం నెలకొందని అధికారులు తెలిపారు. ఓటు వేసేందుకు వచ్చిన ఆర్నేపల్లి శ్రీనివాసరావు పేరు వద్ద బీఎల్వో పొరపాటున మృతి చెందినట్లు మార్ కు చేయడంతో పీవో అభ్యంతరం తెలిపారు. వెంటనే సహాయ ఎన్నికల అధికారిణి రామలక్ష్మి జోక్యంతో సమస్య పరిష్కారమైందని, ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారని స్థానికులు పేర్కొన్నారు.