జీకే వీధి ఎన్నికల ప్రచారంలో మోహన్ రావు దూకుడు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: జి.కె.వీధి

అల్లూరి జిల్లా జీకే వీధి మండలంలో రిటైర్డ్ టీచర్ ఇండిపెండెంట్ అభ్యర్థి కంకిపాటి మోహన్ రావు మంగళవారం దారకొండ గుమ్మిరేవుల సీలేరు ప్రాంతాలలో జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్ లో విజయ డొంక మోగించేందుకు ఓటర్లు తమ అమూల్యమైన ఓటును బ్లాక్ బోర్డ్ గుర్తుపై ఆశీర్వదించాలని కోరారు. అభివృద్ధి తన ధ్యేయమని ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.