జూనియర్ స్క్వాష్ టైటిల్ సాధించి సీనియర్ విభాగంలోకి అనాహత్ సింగ్ అడుగు

రిపోర్టర్: మహేష్ స్థలం: India

ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న యువ క్రీడాకారిణి అనాహత్ సింగ్ జూనియర్ కేరీర్‌ను ఘనంగా ముగించి సీనియర్ విభాగంలోకి అడుగుపెడుతోంది. తన పదేళ్ల స్క్వాష్ ప్రయాణంలో ఈ టైటిల్ సాధించడం ఎంతో సంతృప్తినిచ్చిందని ఆమె తెలిపారు. ఆసియా క్రీడలపై దృష్టి సారించిన ఆమె, లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో అర్హత సాధించడమే తన తదుపరి ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.